*సల్మాన్‌ఖాన్‌ ఫిల్మ్స్‌(ఎస్‌కేఎఫ్‌)* అనే నిర్మాణ సంస్థను స్థాపించి బాలీవుడ్ కండ‌ల వీరుడు సల్మాన్‌ఖాన్‌‌ సినిమాలను నిర్మిస్తున్నారు. అయితే.. ‘ఎస్‌కేఎఫ్‌’లో నిర్మించనున్న సినిమాల్లో నటించే అవకాశాలు ఇప్పిస్తామన్నట్లుగా పలువురికి ఫేక్‌ ఈ–మెయిల్స్‌ అందుతున్నాయట. ఈ విషయంపై సల్మాన్‌ స్పందించారు. ఏకంగా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న‌ పేరుని దుర్వినియోగం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాన‌ని స‌ల్మాన్‌ఖాన్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

 

*నేను నటించబోతున్న సినిమాల్లో కానీ, ఎస్‌కేఎఫ్‌ సంస్థలో నిర్మించబోతున్న సినిమాల కోసం కానీ ప్రస్తుతం న‌టుల ఎంపిక‌ జరగడం లేదు. మేం ఎటువంటి క్యాస్టింగ్‌ ఏజెంట్స్‌ని నియమించలేదు. మా సినిమాల్లో నటించే అవకాశాలు ఇప్పిస్తామన్నట్లుగా వస్తున్న ఈ మెయిల్స్, మెసేజ్‌లను, వార్తలను ఎవ‌రూ  నమ్మొద్దు. ఎస్‌కేఎఫ్‌ బ్రాండ్‌ను, అలాగే పేరును దుర్వినియోగం చేసినవారి పట్ల చట్టపరమైన చర్యలు తీసుకుంటాం* అని సల్మాన్‌భాయ్ హెచ్చ‌రించారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: