ఆర్కిటిక్ స‌ముద్రం.. అంతా మంచుతో నిండి ఉంటుంది. అయితే.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌నం ఆర్కిటిక్ స‌ముద్రం సాధార‌ణ ప‌టాల‌ను మాత్ర‌మే చూశాం. కానీ.. నాసా మ‌న‌కు ఇప్పుడు స‌రికొత్త ప‌టాల‌ను అందించేందుకు రెడీ అవుతోంది. ఆర్కిటిక్ సముద్రపు మంచు ఎంత మందం లోతుతో ఉంద‌న్న విష‌యాన్ని తెలిపేలా మొదటిసారిగా ఉపగ్రహ ఆధారిత పటాలను రూపొందించడానికి నాసా రెడీ అవుతోంది. ఇక గత దశాబ్దంలో మంచు 20శాతం వరకు ప‌లుచ‌బ‌డింద‌ని ప్రాథమిక ఫలితాలు సూచిస్తున్నట్లు నాసా పేర్కొంది.

 

ఇదిలా ఉండ‌గా.. కొద్దిరోజుల క్రిత‌మే చందమామ‌కు చెందిన సరికొత్త ప‌టాల‌ను కూడా నాసా ఆవిష్క‌రించిన విష‌యం తెలిసిందే. చంద్రుడిపై ముందు ముందు చేప‌ట్ట‌బోయే ప్ర‌యోగాల‌కు ఈ ప‌టాలు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతాయ‌ని నాసా పేర్కొంది. ఇప్పుడు తాజాగా.. ఆర్కిటిక్ స‌ముద్ర‌పు మంచుకు సంబంధించిన శాటిలైట్ ఆధారిత ప‌టాల‌ను రూపొందిస్తుండ‌డం గ‌మ‌నార్హం. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: