క‌రోనా వైర‌స్ సృష్టించిన విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ప్ర‌పంచ దేశాలు విల‌విలాడుతున్నాయి. అన్నిరంగాల కార్య‌క‌లాపాలు ఆగిపోయాయి. ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు కుప్ప‌కూలిపోతున్నాయి. ఈ నేప‌థ్యంలో ల‌క్ష‌ల సంఖ్య‌లో ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. దీంతో ప్ర‌పంచ వ్యాప్తంగా నిరుద్యోగిత పెరిగిపోయింది. ప్ర‌పంచంలో ప్ర‌స్తుతం అత్య‌ధిక నిరుద్యోగ రేట్ ర‌ష్యాలో ఉంది. ఈ దేశంలో 29.1శాతం నిరుద్యోగిత ఉంది. ఆ త‌ర్వాత ఇండియాలోనే నిరుద్యోగులు ఎక్కువ‌గా ఉన్నారు.

 

ప్ర‌స్తుతం భార‌త్‌లో 23.5శాతం నిరుద్యోగ రేట్ ఉంది. నిజానికి.. కొద్దిరోజుల క్రితం ఈ శాతం ఎక్కువ‌గానే ఉంది. అయితే.. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన లాక్‌డౌన్ స‌డ‌లింపుల‌తో కొన్ని రంగాల కార్య‌క‌లాపాలు సాగుతున్నాయి. దీంతో నిరుద్యోగ రేట్ కొంత‌మేర‌కు త‌గ్గింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన అమ‌లు చేసిన తరువాత 2020 ఏప్రిల్‌లో 20-30 సంవత్సరాల మధ్య వయస్సు గల 27 మిలియన్ల యువత ఉద్యోగాలు కోల్పోయారని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకాన‌మీ పేర్కొంది. ఆ త‌ర్వాత అమెరికాలోనూ వేల సంఖ్య‌లో ఉద్యోగాలు పోయాయి. ఇక్క‌డ ప్ర‌స్తుతం 14.7శాతం నిరుద్యోగ రేట్ ఉంది. అయితే.. చైనా మాత్రం మెరుగైన స్థానంలో ఉంది. ఈ దేశంలో కేవ‌లం 5.9శాతం నిరుద్యోగ రేట్ ఉండ‌డం గ‌మ‌నార్హం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: