తెలంగాణాలో ఆర్టీసి బస్సులను నడిపే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే సూచనలు కనపడుతున్నాయి. తెలంగాణా ఆర్టీసి ని మరో రెండు మూడు రోజుల్లో రోడ్ల మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలను తెలంగాణా సర్కార్ చేస్తుంది. ఈ నేపధ్యంలోనే నాన్ స్టాప్ బస్సులను గ్రీన్ ఆరెంజ్ జోన్ లో నడపాలని కంటైన్మేంట్ జోన్ లు ఉన్న రెడ్ జోన్స్ లో చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకుని నడిపే అవకాశం ఉందని అంటున్నారు. 

 

అదే విధంగా టికెట్ ధరలను పెంచే అవకాశం ఉందని సమాచారం. దాదాపు 30 శాతం టికెట్ ధరలను పెంచే విధంగా అడుగులు వేస్తున్నారు. ఇక పల్లెవెలుగు సిటీ బస్సులను ఇప్పట్లో వద్దు అని కేసీఆర్ భావిస్తున్నారు. అధికారులు దీని మీద పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: