దేశంలో కరోనా విజృంభణతో లాక్ డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ వల్ల దేశంలోని ప్రైవేట్ సంస్థలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. పలు కంపెనీలు ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తుండగా.... మరికొన్ని కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా ప్రముఖ క్యాబ్‌ సేవల సంస్థ ఊబర్ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. తమ సంస్థలో పని చేసే 3,700 మంది క్యాబ్ డ్రైవర్లను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. 
 
ఊబర్ సంస్థ ప్రతినిధి తాజాగా జూమ్ వీడియో కాల్ లో సంస్థలో 3,700 మంది ఉద్యోగులను తొలగిస్తూ కీలక ప్రకటన చేశారు. సంస్థలో ఈరోజే మీ ఆఖరి పనిదినం అని చెప్పడంతో షాక్ అవ్వడం ఉద్యోగుల వంతయింది. ఊబర్ దారిలోనే మరికొన్ని సంస్థలు కూడా పయనించే అవకాశం ఉందని తెలుస్తోంది. లాక్ డౌన్ వల్ల ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న ప్రజలు కంపెనీలు వేతనాల్లో కోత విధిస్తూ ఉద్యోగాలను తొలగిస్తూ ఉండటంతో ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: