తెలంగాణాలో లాక్ డౌన్ ని చాలా కఠినం గా అమలు చేస్తున్నారు. బయటకు వచ్చిన వారి మీద డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసారు. ఎవరు బయటకు వచ్చినా సరే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. దాదాపుగా ప్రతీ మండలంలో కూడా డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నారు అధికారులు. తాజాగా కరీంనగర్ లో ఒక పొలంలో క్రికెట్ ఆడుకుంటున్న పిల్లలను గుర్తించారు డ్రోన్ సహాయం తో. 

 

ఈ వీడియో ని కరీంనగర్ సీపీ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా దాన్ని తెలంగాణా డీజీపీ ఆఫీస్ షేర్ చేసింది. “మీ పోలీసులు మిమ్మల్ని చూస్తున్నారు. ప్రియమైన తల్లిదండ్రులు, మీ ప్రియమైన వారిని బయటకు అనుమతించవద్దు. మీ కుటుంబానికి పోలీసుగా ఉండండి .. మీరు ఎప్పటిలాగే వారికి కవచంలా ఉండండి అంటూ షేర్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: