దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా ప్రజా రవాణా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ప్రజలు అందరూ ఇళ్ళల్లోనే ఉండాలి అని కేంద్ర సర్కార్ చెప్పడంతో ఇప్పుడు అందరూ కూడా ఇంటికే పరిమితం అయిపోయారు. ఇక లాక్ డౌన్ లో కొన్ని సడలింపులు ఇస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. 

 

ఈ నేపధ్యంలోనే ప్రయోగాత్మకంగా హర్యానా రాష్ట్రంలో బస్సు సర్వీసులను ప్రారంభిస్తుంది అక్కడి ప్రభుత్వం. సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని సిఎం మనోహర్ లాల్ కట్టర్ ఆదేశాలు ఇచ్చారు. గ్రీన్ జోన్ ఆరెంజ్ జోన్ లో ఈ బస్సులు నడుస్తాయి. హర్యానాలో కేసులు అదుపులోనే ఉన్నా సామాజిక దూరం పాటిస్తూ శానిటేషన్ చేస్తూ ప్రజా రవాణా కు అనుమతి ఇవ్వనున్నారు. శుక్రవారం నుంచి ఈ ప్రజా రావణా మొదలయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: