నిన్న ఉదయం నుంచి హైదరాబాద్ లో చిరుత పులి చుక్కలు చూపిస్తుంది. ఎక్కడ తిరుగుతుందో తెలియడం లేదు ఎక్కడ ఉందో అర్ధం కావడం లేదు. ఇటు మీడియా అటు పోలీసులు మరో వైపు అటవీ శాఖ సిబ్బంది దాని ఆచూకి కోసం నానా అవస్థలు పడుతున్నారు. ఎట్టకేలకు దాని ఆచూకీని అధికారులు కనుకున్నారు. 

 

బుద్వేల్ రైల్వే స్టేషన్ పక్కన ఉన్న ఫాం హౌస్ లో చిరుత ఉందని గుర్తించారు. అక్కడ దట్టమైన చెట్ల మధ్య పులి పాద ముద్రలు ఉన్నాయని గుర్తించారు అధికారులు. దీనితో అటవీ శాఖకు చెందిన షూటర్లు రంగంలోకి దిగారు. పులిని ఏ విధంగా అయినా సరే బంధించడానికి రంగం సిద్దం చేసారు. దానికి ఎర వేయడానికి మేకలను కూడా తెప్పించారు. ముందు దానికి మత్తు మందు ఇవ్వనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: