తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కరోనా తో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు పేద ప్రజలు.  అయితే పట్టణ స్థాయిలో ఉన్నవారిని ఆదుకునేందుకు ఎంతో మంది స్వచ్చంద సంస్థలు.. వ్యాపారవేత్తలు, రాజకీ, సినీ వర్గాలకు చెందిన వారు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అయితే తెలంగాణలో పేదల ఆకలి తీర్చడానికి ‘అన్నపూర్ణ క్యాంటీన్లు’  ప్రారంభించి ఆరేళ్లు అవుతోంది. ఈ నేపథ్యంలో ఓ వీడియోను పోస్ట్ చేసిన తెలంగాణ మంత్రి కేటీఆర్ అక్షయపాత్రకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రజలు ఆకలితో ఇబ్బందులు పడుతుంటే.. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో అన్నపూర్ణ భోజన కేంద్రాలను ఆరేళ్ల క్రితం ప్రారంభించాం. దాదాపు 5.5 కోట్ల మీల్స్‌ను ఈ క్యాంటీన్లు అందించాయి.   

 

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కరోనా పై యుద్దం చేస్తున్నాం.. ఈ సమయంలో ‘అన్నపూర్ణ క్యాంటీన్లు ’ ఎంతో మంది అన్నార్తుల ఆకలి తీరుస్తుంది.  ఈ నేపథ్యంలో ఈ క్యాంటీన్లు 65 లక్షల మందికిపైగా ప్రజలకు నాణ్యమైన భోజనాన్ని అందజేశాయి. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయలేని అతిపెద్ద కార్యక్రమం ఇది. అక్షయపాత్రకు, కష్టపడి పనిచేస్తోన్న సిబ్బందికి ధన్యవాదాలు  అని కేటీఆర్‌ తెలిపారు.  హైదరాబాద్‌ పరిధిలో సుమారు 150 అన్నపూర్ణ క్యాంటీన్లు ఉన్నాయి. మధ్యాహ్నం, రాత్రి ఈ క్యాంటీన్లలో రూ.5కే భోజనం పెడుతున్నారు. అంతేకాదు, కరోనా విజృంభణ నేపథ్యంలో ఈ క్యాంటీన్లలో ఉచితంగా ఆహారం  అతిపెద్ద భోజన శాల అంటు మెచ్చుకున్నారు మంత్రి కెటిఆర్. 

మరింత సమాచారం తెలుసుకోండి: