ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు ప్రభుత్వం పెట్టుబడి కోసం 5,500 రూపాయలు జమ చేస్తుందని అన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని స్పష్టం చేశారు. రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఎరువులు, పురుగుమందులు అందిస్తామని తెలిపారు. గ్రామాల్లోని రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. భూసార పరీక్షలు చేయించి రైతులకు ప్రయోజనం చేకూరుస్తామని అన్నారు. 
 
రైతుల కళ్లల్లో ఆనందం చుడాలని దేవున్ని కోరుకుంటున్నానని అన్నారు. రైతులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా సమస్యలన్నీ తీరతాయని.. ధరల స్థిరీకరణ నిధుల ద్వారా పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని అన్నారు. గ్రామస్థాయి నుంచే వ్యవసాయం ప్రక్షాళన చేస్తామని.. రైతులకు వ్యవసాయం లాభసాటి అయ్యేలా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని జగన్ అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: