ఏపీఎస్ ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. ఈరోజు 6,000 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. డిపో మేనేజర్లు ఈరోజు నుంచి విధులకు హాజరు కావద్దంటూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. డిపో మేనేజర్లు ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్టు చెబుతున్నారు. 
 
మరోవైపు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గత నెల వేతనాలు ఇప్పటికీ అందలేదని తెలుస్తోంది. కార్మిక సంఘాలు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై వేటు వేస్తూ ఆర్టీసీ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. బాలకాశి, కార్యదర్శి నూర్ మొహమ్మద్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు యథావిధిగా కొనసాగించాలని.... లాక్ డౌన్ సమయంలో విధుల నుంచి తొలగిస్తే వారు ఇబ్బందులు పడతారని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: