ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు 20,000 కోట్లు చెల్లించాల్సి ఉందని.... డిసెంబర్ 2019కు ప్రభుత్వం బకాయిలను 15,000 కోట్ల రూపాయలకు తెచ్చిందని అన్నారు. డిస్కంలకు టీడీపీ 7,192 కోట్లు చెల్లించాల్సి ఉండగా వైసీపీ 5,000 కోట్ల రూపాయలు చెల్లించిందని అన్నారు. మార్చి 2014లో యూనిట్ 4.30 రూపాయల కరెంట్ ను చంద్రబాబు యూనిట్ రేటును 6 రూపాయలకు పెంచారని అన్నారు. 
 
ప్రస్తుతం జగన్ సర్కార్ 5 రూపాయల 66 పైసలకు యూనిట్ చొప్పున జగన్ సర్కార్ కొనుగోలు చేసిందని అన్నారు. రాష్ట్రంలో ఏప్రిల్ నెల నుంచి కొత్త టారిఫ్ అమలులోకి వచ్చిందని బుగ్గన చెప్పారు. గత ప్రభుత్వం బకాయిలను జగన్ సర్కార్ చెల్లిస్తోందని అన్నారు. రాష్ట్రంలో 2 నెలలుగా మీటర్ రీడింగ్ తీయకపోవడంతో టారిఫ్ స్లాబ్ మారడంతో కరెంట్ బిల్లులు పెరిగాయని అన్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన తన మాటలతో బాబోరి పాలనను ఏకిపారేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: