గద్వాల గర్భిణి మృతి మృతి ఘటనపై హైకోర్ట్ ఓ విచారణ జరిగింది. న్యాయవాది కిషోర్ కుమార్ లేఖపై హైకోర్ట్ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కీలక సూచనలు చేసింది. మహిళకు పరిహారం చెల్లింపు పై కౌంటర్ దాఖలు చెయ్యాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది హైకోర్ట్. ఘటనపై విచారణ జరుగుతుందని నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని అడ్వకేట్ జనరల్ చెప్పారు. 

 

రెడ్ జోన్లలో కరోనాయేతర వైద్య సేవలకు అంబులెన్స్ లు అందుబాటులో ఉంచాలని హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. రెడ్ జోన్లలో నోడల్ అధికారులను నియమించి విస్త్రుత ప్రచారం నిర్వహించాలని హైకోర్ట్ సూచనలు చేసింది. గర్భిణి మహిళలను తీసుకుని వెళ్ళే వాహనాలకు పాస్ లు అడగవద్దు అని హైకోర్ట్ స్పష్టం చేసింది. గర్భిణి స్త్రీలకు ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: