శ్రీకాకుళం లో విషాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం డిఎస్పీ గా విధులు నిర్వహిస్తున్న కృష్ణ వర్మ అనే ఆఫీసర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన బీచ్ రోడ్ లో ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది. శ్రీకాకుళం స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ గా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 

 

తన ఇంట్లోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఉరి వేసుకుని ఆత్మహత్య కు పాల్పడ్డారు. అనారోగ్య సమస్యలతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు అని తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి ఇంకా అధికారులు ఎవరూ వివరాలను వెల్లడించలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: