కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు వ్యవసాయం, మత్స్య శాఖ, ప్రశు సంవర్థక శాఖల గురించి కీలక ప్రకటనలు చేయనున్నట్టు తెలిపారు. నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ వ్యవసాయానికి సంబంధించి 11 చర్యలు ఉండనున్నాయని తెలిపారు. దేశంలో పాల సేకరణ రంగం సంక్షోభం ఎదుర్కుంటోందని అన్నారు. గడువు తీరిన అక్వా హేచరీస్ లకు రిజిస్ట్రేషన్ గడువు మూడు నెలలు పొడిగిస్తున్నట్టు తెలిపారు. 
 
అక్వా రైతుల ఎగుమతుల కోసం ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నామని అన్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద 20,000 కోట్ల రూపాయలతో నిధిని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మత్స్యకారుల మౌలిక సదుపాయాల కోసం 9,000 కోట్ల రూపాయలతో నిధిని ఏర్పాటు చేస్తామని అన్నారు. అక్వా కల్చర్ కు 11,000 కోట్ల రూపాయలతో నిధి ఏర్పాటు చేస్తామని... రాబోయే ఐదేళ్లలో 70 లక్షల టన్నుల మత్స్య సంపద దోహదం చేస్తామని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: