దేశంలో కరోనా వేగంగా విజృంభించటంతో రిటైల్ వ్యాపారాలు దెబ్బ తింటున్నాయి. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉండటంతో ఆయుర్వేద ఔషధాల తయారీ సంస్థ పతంజలి ఈ కామర్స్ రంగంలోకి అడుగుపెట్టి ఆన్ లైన్ ద్వారా కార్యకలాపాలను విస్తరించాలని యోచిస్తోంది. బాబా రాందేవ్ నేతృత్వంలో నడుస్తున్న పతంజలి ‘orderme’ వెబ్‌సైట్ ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేయనుంది. మరికొన్ని రోజుల్లో ఈ వెబ్ సైట్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. 
 
ఆర్డర్ చేసిన కొన్ని గంటల్లోనే సరుకులు డెలివరీ చేయడంతో పాటు... కస్టమర్ల నుంచి డెలివరీ చార్జీలు ఉండవని సంస్థ ఎండీ బాలకృష్ణ చెప్పారు. మోదీ స్వదేశీ వస్తువుల పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. పతంజలి ఆయుర్వేద సంస్థ తక్కువ కాలంలోనే దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అత్యంత ప్రభావశీల సంస్థల జాబితాలో స్థానం దక్కించుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: