భార‌త సంత‌తికి చెందిన చెఫ్‌ను పెళ్లి చేసుకున్న ఆస్ట్రియా యువ‌రాణి మరియా గాలిట్జీన్ (31) గుండెపోటు రావ‌డంతో క‌న్నుమూశారు. రెండు వారాల క్రితమే మరియా మృతి చెందగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2017 లో హ్యూస్ట‌న్‌లో న‌గ‌రంలో చెఫ్ రిషి రూప్ సింగ్‌ను మరియా ప్రేమించి వివాహం చేసుకున్నారు. రిషి రూప్ ఎగ్జిక్యూటివ్ చెఫ్‌గా ప‌నిచేస్తున్న హ్యూస్ట‌న్‌లో మరియా ఇంటీరియర్ డిజైనర్ గా పని చేశారు. 
 
ప్రిన్స్ పీటర్ గాలిట్జీన్, ప్రిన్సెస్ మరియా అన్నా కూతురు అయిన యువరాణి మరియా 1988 లో ల‌గ్జంబ‌ర్గ్‌లో జ‌న్మించారు. మరియా దంపతులకు రెండేళ్ల కుమారుడు మాక్సిమ్ ఉన్నాడు. మ‌రియాకు ముగ్గురు సోద‌రీమ‌ణులు, ఒక సోద‌రుడు ఉన్నారు. ఐదు సంవ‌త్స‌రాల వ‌య‌స్సులోనే ర‌ష్యాకు మ‌కాం మార్చిన మరియా అక్కడే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. చిన్న వ‌య‌స్సులోనే మ‌రియా మ‌ర‌ణించ‌డంతో రాజకుటుంబీకులు సంతాపం తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: