కరోనా వైర‌స్ సృష్టించిన విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో అన్న‌రంగాలు దెబ్బ‌తిన్నాయి. దేశవ్యాప్తంగా అనేక పరిశ్రమలను, వ్యాపారాలు కుదేల‌వుతున్నాయి. అవ‌స‌రం అయితే.. ఉద్యోగుల‌ను తొల‌గిస్తున్నాయి.. లేదా జీతాల్లో కోత పెడుతున్నాయి. కానీ.. ఏషియన్‌ పెయింట్స్‌ కంపెనీ మాత్రం ఈ సంక్షోభాన్ని దీటు ఎదుర్కొంటోంది. ప్రస్తుత కష్టకాలంలోనూ ఈ సంస్థ వేతనాల పెంపుతో తమ సిబ్బందిలో ఆత్మైస్థెర్యాన్ని నింపేందుకు ప్రయత్నిస్తున్నది. అమ్మకాల విభాగం సిబ్బందికి బీమాతోపాటు దవాఖాన ఖర్చులకు సాయమందిస్తున్న ఏషియన్‌ పెయింట్స్‌.. మరోవైపు భాగస్వామ్య సంస్థలకు పూర్తి శానిటైజేషన్‌ సదుపాయాలు కల్పించి ప్రత్యక్ష నగదు తోడ్పాటును అందజేస్తున్నది.

 

కేంద్ర రాష్ర్టాల కొవిడ్‌-19 సహాయ నిధులకు ఈ సంస్థ ఇప్పటికే రూ.35 కోట్ల విరాళమిచ్చిన విష‌యం తెలిసిందే. తమ కాంట్రాక్టర్ల బ్యాంకు ఖాతాలకు రూ.40 కోట్లు బదిలీ చేసింది. ‘భాగస్వాములందరి బాగోగులు చూసుకొనే సంస్థగా మనం నిజమైన నాయకత్వానికి ఉదాహరణగా నిలవాలి. ఇందుకోసం చేపట్టిన చర్యలన్నింటినీ ఎప్పటికప్పుడు మా బోర్డు డైరెక్టర్లకు వివరించి వారి ఆమోదం పొందాను’ అని ఏషియన్‌ పెయింట్స్‌ ఎండీ, సీఈవో అమిత్‌ సింగ్లే తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: