తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ హైదరాబాద్‌లోని నాలుగు జోన్లకే పరిమితమైంద‌ని.. ఎల్బీనగర్, మలక్‌పేట, చార్మినార్, కార్వాన్‌ జోన్లలోనే ప్రస్తుతం యాక్టివ్‌ కేసులున్నాయని ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలిపారు. *ఈ జోన్లలో 1,442 కుటుంబాలున్నాయి. యాదాద్రి భువనగిరి, జనగామ, మంచిర్యాల జిల్లాలకు చెందిన కొందరు వలస కూలీలకు కొందరికి వైరస్‌ సోకినట్లు తేలింది తప్ప, ఆ జిల్లా వాసులెవరికీ పాజిటివ్‌ లేదు. ఆ వలస కూలీలు కూడా హైదరాబాద్‌లోనే చికిత్స పొందుతున్నారు. కాబట్టి ఆ మూడు జిల్లాల్లో పాజిటివ్‌ కేసులు ఉన్నట్లు పరి గణించడానికి లేదు. పాజిటివ్‌ కేసులున్న నాలుగు కంటైన్మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నాం. లక్షణాలున్న వారికి పరీక్షలు నిర్వహించి, చికిత్స చేస్తున్నాం* సీఎం వెల్లడించారు.

 

కాగా, తెలంగాణలో శుక్రవారం మళ్లీ 40 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యా యి. అందులో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 33 నమోదు కావడం గ‌మ‌నార్హం. మరో 7 కేసులు వలసదారులకు సంబంధించినవని. రాష్ట్రంలో మొ త్తం కరోనా కేసుల సంఖ్య 1,454కు చేరుకుంది. శుక్రవారం 13 మంది కోలుకున్నారు. వారిలో హైదరాబాద్‌కు చెందినవారు ఐదుగురు ఉన్నారు. వికారా బాద్, ఆసిఫాబాద్‌ జిల్లాలకు చెందిన వారు ఒక్కొక్కరున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 959 మం ది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 34 మంది చనిపోగా, ప్రస్తు తం 461 మంది చికిత్స పొందుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: