ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో 21మంది వ‌ల‌స కార్మికులు ద‌ర్మ‌ర‌ణం చెందారు. మ‌రో 20మంది తీవ్ర‌గాయాల‌తో స‌మీపంలోని ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. వ‌ల‌స కూలీల‌తో రాజ‌స్తాన్ నుంచి ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని గోర‌ఖ్‌పూర్‌కు ట్ర‌క్కును ఔర‌యా నేష‌న‌ల్ ర‌హ‌దారిపై కొత్వాలి వ‌ద్ద‌ మ‌రో ట్ర‌క్కు ఢీకొట్టింది. దీంతో అక్క‌డిక‌క్క‌డే 23మంది మ‌ర‌ణించారు. ఈ ఘ‌ట‌న దృశ్యాలు భ‌యాన‌కంగా ఉన్నాయి.

 

స్వ‌స్థ‌లాల‌కు వెళ్తున్న వ‌ల‌స కూలీలు నిత్యం ఏదో ఒక చోట ప్ర‌మాదానికి గుర‌వుతూనే ఉన్నారు. దీంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెల‌కొంది. త‌రుచూ జ‌రుగుతున్న ప్ర‌మాదాల్లో ఇప్ప‌టికే వంద‌మందికిపైగా వ‌ల‌స కూలీలు దుర్మ‌ర‌ణం చెందిన‌ట్లు ప‌లువురు విశ్లేష‌కులు చెబుతున్నారు. లాక్‌డౌన్ కార‌ణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న కార్మికులు స్వ‌స్థ‌లాల‌కు త‌ర‌లివెళ్లే క్ర‌మంగా ప్ర‌మాదాలు చోటుచేసుకుంటున్నాయి. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: