కేంద్ర హోం శాఖ తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. వలస కార్మికులు రోడ్డు మార్గం ద్వారా, రైల్వే ట్రాక్ పై నడుస్తూ సొంతూళ్లకు వెళ్లడంపై నిషేధం విధించింది. కేంద్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ భల్లా ప్రత్యేక శ్రామిక్ రైళ్ల ద్వారా, ప్రత్యేక బస్సుల ద్వారా ప్రయాణాలను సులభతరం చేయాలని చేయాలని రాష్ట్రాల సీఎస్‌లకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రైల్వే శాఖ 100 శ్రామిక్ రైళ్లను నడుపుతోందని అవసరమైతే మరికొన్ని రైళ్లను నడపడానికి రైల్వే శాఖ సిద్ధంగా ఉందని తెలిపారు. 
 
ప్రత్యేక ప్యాసింజర్ రైళ్లలో, శ్రామిక్ రైళ్లలో స్వస్థలాలకు చేరుకోవాలని వెళుతున్న ప్రయాణికులు రైల్వే స్టేషన్ల నుంచి వారి సొంతూళ్లకు బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లాక్ డౌన్ వల్ల పబ్లిక్, ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ నిలిచిపోవడంతో బస్సులను నడిపే సందర్భంలో కరోనా కట్టడి కోసం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది. ప్రయాణికులు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించేలా చూడాలని సూచనలు చేసింది. 
 


 

మరింత సమాచారం తెలుసుకోండి: