గుంటూరు జిల్లా నరసరావుపేటలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. గుంటూరు నగరంతో సమానంగా నరసరావుపేటలో కేసులు నమోదవుతున్నాయి. గుంటూరు జిల్లాలో 404 కేసులు నమోదు కాగా దాదాపు సగం కేసులు నరసరావుపేటలో నమోదు అయ్యాయి. జిల్లాలో నరసరావుపేట కరోనా వైరస్ వ్యాప్తికి కేంద్రంగా మారింది. నరసరావుపేట దేశంలోనే కరోనా వ్యాప్తికి మేజర్ హాట్ స్పాట్ గా మారిందంటే ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 
 
నరసరావుపేటలో భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడంతో ఆ ప్రాంతం నుంచి ఎవ్వరినీ పల్లెలకు రానీయడం లేదు. నరసరావుపేట పట్టణం నుంచి గ్రామాలకు ఎవరైనా వస్తే గ్రామస్థులు వారిని అడ్డుకుని వెనక్కు పంపిస్తున్నారు. నరసరావు పేట పట్టణంలో కరోనా వైరస్‌ నియంత్రణకు అధికారులు మిషన్‌ 15 పేరుతో కార్యాచరణ ప్రారంభించారు. రాబోయే 15 రోజుల తర్వాత కొత్త కేసులు ఉండరాదనే లక్ష్యంతో అధికార యంత్రాంగం నరసరావుపేటలో పని చేస్తున్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: