అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ స్టైలే వేరు.. తాను చెప్ప‌ద‌ల్చుకున్న‌ది సూటిగా సుత్తిలేకుండా చెప్పేస్తాడు. ఎవ‌రిమాట‌నూ పెద్ద‌గా ప‌ట్టించుకోడు. ఇక మీడియాను అయితే ఒక ఆటాడేసుకుంటాడు. అనేక మార్లు మీడియాపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇక క‌రోనా వైర‌స్ విష‌యంలో మాత్రం ట్రంప్‌ను అమెరిక‌న్లు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శిస్తున్నారు.

 

తాజాగా.. కొంత‌మంది అమెరిక‌న్లు ర‌హ‌దారిప‌క్క‌న ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శిస్తూ నిర‌స‌న తెలిపారు. ఈ సంద‌ర్భంగా స్మాల్ బిజినెస్ త‌ప్ప‌నిస‌రి అంటూ ప్ల‌కార్డులు ప్ర‌దర్శించారు. ఈ వీడియోను ఒక‌ర‌కు ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసి.. అమెరికన్లు ఎంతో కోపంతో ఉన్నార‌ని చెప్పారు. అయితే.. ఈ వీడియోను ట్రంప్ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. న‌కిలీ వార్త‌లు త‌ప్స‌నిస‌రికాదంటూ సెటైర్లు వేశాడు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: