ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండం గా మారింది అని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. పారా దీప్ కి దక్షిణంగా 1100 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయినట్టు వాతావరణ శాఖ పేర్కొంది. ఏపీ పై తుఫాన్ ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 

 

కాని జాగ్రత్తగా ఉండటమే మంచిది అనే అభిప్రాయాన్ని వాతావరణ శాఖ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర కోస్తా దక్షిణ ఓడిసా తీరం వెంబడి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు చెప్తున్నారు. మత్స్య కారులు వేటకు వెళ్ళకుండా ఉండటమే మంచిది అని రైతులు అప్రమత్తంగా ఉండటం మంచిది అని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: