లాక్ డౌన్ లో వ్యాపారులు ఏ స్థాయిలో నష్టపోతున్నారు అనేది అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు తినడానికి కూడా తిండి లేక అవస్థలు పడుతున్నారు వ్యాపారస్తులు. వారిని ఆదుకోవడానికి ప్రభుత్వాలు ముందుకు వచ్చినా సరే వారికి మాత్రం సాయం అందే పరిస్థితి దాదాపుగా లేదు అనే విషయం అర్ధమవుతుంది. అద్దెలు కట్టలేక, ఉద్యోగులను పోషించలేక ఇబ్బందులు పడుతున్నారు. 

 

ఈ తరుణంలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ యజమాని తన పెద్ద మనసు చాటుకున్నాడు. కడప జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో పీఎంఆర్ షాపింగ్ మాల్ యజమాని పెండ్యాల విజయ్ కుమార్... లాక్ డౌన్ కారణంగా వ్యాపారులు అందరూ నష్టపోయారు అని తనకు అద్దె వద్దు అని చెప్పారు. తనకు నెలకు లక్ష రూపాయల ఆదాయం వస్తుంది అని తనకు మే నెల అద్దె వద్దు అని చెప్పారట.

మరింత సమాచారం తెలుసుకోండి: