దేశంలో కరోనా వ్యాప్తి చెందుతుందని మార్చి నుంచి లాక్ డౌన్ ప్రకటించారు.  అప్పటి నుంచి వలస కార్మికులు నానా కష్టాలు  పడతూ వచ్చాయి. ఈ మద్య వలస కార్మికులు తమ సొంత ప్రదేశాలకు పోవొచ్చని కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  సొంత గ్రామాలకు వెళ్లాలని అనుకుంటున్న వలస కార్మికుల పాలిట వాహనాలు యమ పాశాల్లా మారుతున్నాయి. వరుసగా ప్రమాదాలబారిన పడి పదుల సంఖ్యలో ప్రజలు మరణిస్తూనే ఉన్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో మరో ఘోర విషాదం చోటు చేసుకుంది. కూలీలతో వెళ్తున్న ట్రక్కు మరో ట్రక్కును ఢీ కొట్టడంతో 21మంది మరణించగా , పలువురికి గాయాలు అయ్యాయి. శనివారం ఉదయం ఔరాయ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది.  

 

 

ఉత్తరప్రదేశ్‌లోని ఔరాయా జాతీయ రహదారిపై ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  వలస కార్మికుల మరణం దురదృష్టకరమన్న సీఎం.. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ అదనపు కార్యదర్శి అవినాశ్ అవస్థి తెలిపారు.  ప్రస్తుతం దేశంలో కరోనా వల్ల ప్రజలు ఎంతగా ఇబ్బందులు పడుతున్నారో అందరికీ తెలిసిందే.. కొంతమంది సుదూర ప్రాంతాలకు కాలినడకన వెళ్తున్న పరిస్థితి. కాగా,  బాధితుల్లో చాలామంది బీహార్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారు ఉన్నట్టు ఔరాయ జిల్లా కలెక్టర్ అభిషేక్ సింగ్ తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: