విశాఖపట్నంలో గ్యాస్ లీకేజీ ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ ప్లాంటులో స్టెరీన్ గ్యాస్ లీకై చుట్టుపక్కల ప్రాంతాల్లోని 12 మంది ప్రాణాలు కోల్పోవడం, వేలాది మంది ఆస్పత్రులపాలైన తీరుపై ఐక్యరాజ్యసమితి లాంటి అంతర్జాతీయ సంస్థలు సైతం ఆందోళన వ్యక్తం చేశాయి. ఉన్నట్టుండి వాతావరణంలో చోటు చేసుకున్న పెను మార్పులు ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.  మహా విషాదం ఊరంతా ఆదమరిచి నిద్రిస్తున్న వేళ విషవాయువు వ్యాపించింది. ఊపిరాడనీయకుండా ... ప్రజల రోదనలతో మిన్నంటాయి. ఎటు చూసినా హృదయ విదారకంగా కనిపించాయి.   గ్యాస్ లీకేజీ ఘటనకు సంబంధించి కొందరు అస్వస్థతకు గురై పడిపోయిన పలు దృశ్యాలు ఈ రోజు బయటకు వచ్చాయి.

 

ఓ ఇంటి ముందు ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. తెల్లవారు జామున కొందరు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ విషవాయువు పీల్చి అక్కడే పడిపోయారు. పాపం ఓ చిన్నారి ఊపిరి ఆడక ఇబ్బందులు పడుతుంటే.. వెంటనే అతని తల్లి వచ్చి తీసుకు వెళ్తుంది.  చాలా సమయం అనంతరం కొందరు గుర్తించి ఆసుపత్రులకు తరలించారు. ఎల్జీ పాలిమర్స్‌ ప్రమాద ఘటన రోజు నిక్షిప్తమైన ఈ దృశ్యాలు మీడియాకు దొరికాయి. కాగా, ఈఘటనకు సంబంధించిన ఇప్పటికే పలు వీడియోలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఏది ఏమైన ఈ ఏడాది విశాఖ వాసులకు నరకం ఏంటో కనిపించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: