దేశ వ్యాప్తంగా వలస కార్మికులు ఇప్పుడు తరుచుగా ప్రమాదాలకు గురవుతున్నారు. దేశంలో వేలాది మంది వలస కూలీలు రోడ్ల మీద నడుస్తూ వెళ్తున్నారు. సొంత ఊర్లకు వెళ్ళడానికి వాళ్ళు రాత్రి పగలు వానా ఎండా అనే తేడా లేకుండా నడుస్తున్నారు. అలాంటి వారిని ఇప్పుడు వరుస రోడ్డు ప్రమాదాలు బలి తీసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. 

 

ఇప్పటి వరకు దాదాపు వంద మంది వలస కూలీలు వరుస ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు మధ్య ప్రదేశ్ లో మరో ఘోర ప్రమాదం జరిగింది. బండా (సాగర్ జిల్లా) సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 5 మంది వలస కార్మికులు మరణించారు, వారు ప్రయాణిస్తున్న ట్రక్కు బోల్తా పడింది. వారు మహారాష్ట్ర నుండి ఉత్తర ప్రదేశ్ వెళ్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: