దేశంలో ఓ వైపు కరోనా కష్టాలు తరుముకొస్తుంటే... మరోవైను విశాక గ్యాస్ లీక్ లాంటి కష్టాలు వస్తున్నాయి.  ఎండలు మండిపోతున్న సమయంలో పాపం వలస కూలీల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.  సుదూర ప్రాంతాల నుంచి తమ గమ్యస్థానాని చేరుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇక దేశంలో మరికొన్ని విషాద ఘటనలు రోజూ చూస్తూనే ఉన్నాం. ఈ రోజు ఉత్తరప్రదేశ్‌లో మరో ఘోర విషాదం చోటు చేసుకుంది. కూలీలతో వెళ్తున్న ట్రక్కు మరో ట్రక్కును ఢీ కొట్టడంతో 21మంది మరణించగా , పలువురికి గాయాలు అయ్యాయి. శనివారం ఉదయం ఔరాయ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది.  తాజాగా జార్ఖండ్ లో దారుణ సంఘటన చోటు చేసుకుంది.  దుమర్సోటా గ్రామానికి చెందిన 8 మంది యువకులు శనివారం ఉదయం స్థానికంగా ఉన్న సోన్‌ నదిలోకి స్నానానికి వెళ్లారు.

 

యువకులందరూ నదిలో దిగి స్నానం చేస్తుండగా ఓ యువకుడు కొంచెం లోపలికి వెళ్లాడు. అతను నీటిలో మునిగిపోవడాన్ని గమనించిన మరో యువకుడు.. అతన్ని కాపాడేందుకు ముందుకెళ్లాడు.  ఒకరినొకరు కాపాడుకునే క్రమంలో నీట మునిగిపోయారు. వాళ్లలో  ఒక్క యువకుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ యువకుడు వెంటనే వెళ్లి గ్రామస్థులకు విషయం తెలిపాడు.  . గ్రామ ప్రజలంతా హుటాహుటిన సోన్‌ నది వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఏడుగురిలో ఐదుగురి మృతదేహాలను వెలికితీశారు. మరో ఇద్దరి మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, మృతులంగా 20 నుంచి 30 లోపు వారేనని పోలీసులు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: