తెలంగాణలో ఇప్పుడు కరోనా తో పోరాటం జరుపుతుంటే మరోపక్క భారీ వర్షాలతో రైతులకు కంటిమీద కునుకు లేకండా చేస్తుంది. ఇదలా ఉంటే.. ఇప్పుడు ఎండ తాపానికి ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.  తాజాగా  హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. ఎండ వేడిమితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగరవాసులకు కాస్త ఉపశమనం లభించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారింది. హైదరాబాద్‌లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది.  

 

సిటీలో పలుచోట్ల శనివారం వర్షం కురిసింది. హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, నాంపల్లి, కాచిగూడ, నల్లకుంట, అంబర్ పేట, మెహిదీపట్నం, పంజగుట్ట, టోలిచౌకి, దర్గా, గోల్కొండ, యూసుఫ్ గూడ, ఎర్రగడ్డ, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, విద్యానగర్, తార్నాక, కూకట్ పల్లి, మియాపూర్, ఫిల్మ్ నగర్, కొండాపూర్, బోరబండ, కొత్తగూడ, మాసాబ్ ట్యాంక్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. కొన్ని చోట్ల ఈదురుగాలులకు ఫ్లెక్సీలు కూలిపడ్డాయి. 

 

బంగాళాఖాతంలో పడిన అల్పపీడనం  మరో 24గంటల్లో AMPHON తుఫానుగా మారుతుందని వాతావారణ శాఖ అధికారులు చెప్పారు. అంతకంటే ముందే వాతావరణంలో మార్పులు వచ్చి భాగ్యనగరాన్ని వర్షం ముంచెత్తింది. దీంతో పలు ప్రాంతాలు జలమయ్యాయి.   కరోనా లాక్ డౌన్ తో ఇళ్లలో ఉండిపోవడంతో ప్రజలకు వర్షం వల్ల ఏ ఇబ్బంది లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: