20 లక్షల కోట్ల ప్యాకేజి లో భాగంగా నాలుగో రోజు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్యాకేజి వివరాలను వెల్లడించారు. ప్యాకేజి లో భాగంగా టూరిజం రవాణా రంగాలకు ప్రోత్సాహకాలు ఇచ్చారు. సంస్కరణల్లో మోడీ ఎప్పుడు ముందు ఉంటారని ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. 

 

ఇప్పుడు ఒకే దేశం ఒకే మార్కెట్ ని అవలంభిస్తామని ఆమె చెప్పారు. ఉపాధి అవకాశాలను పెంచడానికి గానూ సంస్కరణలు అమలు చేస్తామని ఆమె చెప్పారు. భారత్ లో తయారి ద్వారా వినియోగం ఉండాని ఆమె పేర్కొన్నారు. కేంద్ర పాలిత ప్రాంతాల్లో డిస్కం ల పై ప్యాకేజి ఇస్తామని ఆమె చెప్పారు. బొగ్గు ఉత్పత్తిలో కమర్షియల్ విధానానికి శ్రీకారం చుడుతున్నామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: