తీవ్ర పోటీని ఎదుర్కోవడానికి మనల్ని మనం తయారు చేసుకోవాలని కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. రానున్న రోజుల్లో పోటీకి అనుగుణం గా దేశం తయారు కావాలని ఆమె పిలుపునిచ్చారు. పెట్టుబడులకు కేంద్రంగా భారత్ ని తీర్చిదిద్దే ప్రక్రియ కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు. 

 

ఉదయ్ పథకం ద్వారా చిన్న నగరాలకు విమానాలను నడుపుతామని ఆమె పేర్కొన్నారు. సోలార్ ప్లేట్స్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తామని ఆమె పేర్కొన్నారు. కొత్త బొగ్గు గనులను కనుగొనే ప్రక్రియ వేగవంతం చేస్తామని అన్నారు. బిడ్డింగ్ కి 50 కొత్త బొగ్గు గనులు అని నిర్మల పేర్కొన్నారు. గడువు లోగా ఉత్పత్తి చేసిన వారికే ప్రోత్సాహకాలు అని ఆమె స్పష్టం చేసారు. బొగ్గు తవ్వకాలు మౌలిక ఉత్పత్తుల కోసం50 వేల కోట్లను ఆమె కేటాయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: