ఇప్పుడు మాస్క్ లేకుండా బయటకు వస్తే చాలు అసలు ఊరుకోవడం లేదు పోలీసులు. కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఫైన్ వేస్తున్నారు. లేకపోతే బండి అయినా సరే సీజ్ చేసే పరిస్థితి ఉంది. దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. దీనిపై పెద్ద చర్చలే జరుగుతున్నాయి. తాజాగా ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

అది ఏంటీ అంటే అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా బయటకు వస్తారు ఇంటి నుంచి. తన జేబులో ఫోన్ వాలెట్ కార్ కీస్ అన్నీ ఉన్నాయా లేదా అని చూసుకుంటారు. అన్నీ ఉంటాయి కాని ముఖం మీద మాస్క్ ఉండదు. వెంటనే దాని కోసం వెనక్కు పరిగెడతారు. దీనిని తయారు చేసి 2020 లో జీవితం ఇలా ఉందని పలువురు కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: