ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు గ్యాస్ లీక్ అనే పధం వింటే చాలు జనాల గుండెల్లో రైళ్ళు పరిగెత్తే పరిస్థితి ఉంది. చాలా మందికి ఇప్పుడు ఈ గ్యాస్ లీక్ అనే పదం కంటి మీద కునుకు ఉంచడం లేదు అనేది వాస్తవం. ప్రాణాలను అర చేతిలో పెట్టుకుని ఇప్పుడు పరుగులు తీసే పరిస్థితి వచ్చింది అనేది స్పష్టంగా అర్ధమవుతుంది. 

 

విశాఖ గ్యాస్ లీక్ ఘటన విషాదం ఇంకా మరువక ముందే తాజాగా ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. అది ఏంటీ అంటే... కృష్ణా జిల్లా కైకలూరు ఆలపాడులోని ఆక్వా ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అయింది. ఐస్ గడ్డకట్టేందుకు వినియోగించే గ్యాస్ లీక్ కావడంతో మహిళలు అస్వస్థతకు గురయ్యారు. వారి అందరిని గుడివాడ హాస్పిటల్ కు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: