కరోనా దెబ్బకు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సినీ క్రీడా ప్రముఖులు అందరూ కూడా దాదాపుగా ఖాళీ గానే ఉన్నారు. తమ జీవితానికి సంబంధించిన అనేక విషయాలను సోషల్ మీడియా వేదికగా తమ అభిమానులతో పంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక సోషల్ మీడియా లో ఏదోక రూపంలో అలరించే కార్యక్రమాలు చేస్తున్నారు. సినీ స్టార్లు క్రికెటర్లు ఎక్కువగా అలరిస్తున్నారు. 

 

తాజాగా న్యూజిలాండ్ యువ ఆటగాడు ఇలాగే అభిమానులను సోషల్ మీడియాలో అలరించే కార్యక్రమం చేస్తున్నాడు. అది ఏంటీ అంటే... లాక్‌డౌన్‌ సమయంలో తన పెంపుడు కుక్కతో సరదాగా ఆడుకుంటున్న వీడియో ని తన ఇన్‌స్టాలో షేర్‌ చేయగా ఇది వైరల్ అవుతుంది. తన పెంపుడు కుక్కకు స్లిప్‌లో క్యాచ్‌లు ఎలా పట్టాలో నీషమ్‌ ట్రైనింగ్‌ కూడా ఇచ్చాడు గతంలో. అది కూడా వైరల్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: