హైదరాబాద్ లో వర్షం పడితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది అనేది అందరికి తెలిసిన విషయమే. ఒక్క చుక్క వాన పడినా సరే కొన్ని ప్రాంతాల్లో నీళ్ళు మరీ దారుణంగా రోడ్ల మీదకు వచ్చేస్తూ ఉంటాయి. దీనితో ప్రజలు వర్షం పడుతుంది అంటే చాలు భయపడే పరిస్థితి ఉంది. హైదరాబాద్ లో ఎన్ని చర్యలు తీసుకున్నా సరే దాదాపుగా ఇదే పరిస్థితి ఉంటుంది. 

 

శనివారం హైదరాబాద్ లో భారీ వర్షం పడింది. దీనితో ఎర్రగడ్డ జూబ్లీ హిల్స్ సహా పలు ప్రాంతాలు జల మయం అయ్యాయి. ఇక ఎర్రగడ్డ లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రోడ్ల మీదకు భారీగా నీరు చేరింది. దీనితో అక్కడ ఉన్న స్థానికులు అటు వైపు వచ్చే వారికి సోషల్ మీడియా ద్వారా వీడియో లు పోస్ట్ చేసి పరిస్థితిని వివరించే ప్రయత్నం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: