వలస కూలీల ఖర్చు విషయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ కీలక ప్రకటన చేసారు. ఇతర రాష్ట్రాల నుంచి పశ్చిమబెంగాల్‌కు వచ్చే శ్రామిక్ స్పెషల్ రైళ్లలో రాష్ట్రానికి చెందిన వలస కార్మికుల టిక్కెట్ చార్జీల మొత్తాన్ని తమ ప్రభుత్వమే భరిస్తుందని ఆమె ఒక ప్రకటన విడుదల చేసారు. ప్రత్యేక రైళ్లలో వచ్చే వలస కూలీలెవరూ చార్జీలు పెట్టుకోనవసరం లేదని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

 

ఈ మేరకు ఆమె రైల్వే బోర్డు చైర్మన్‌కు ఒక లేఖ కూడా రాసారు. పశ్చిమబెంగాల్‌కు నడిపే ప్రత్యేక రైళ్ల మొత్తం ఖర్చులు తామే భరిస్తామని ఆమె స్పష్టం చేసారు. టికెట్ చార్జీలు వసూలు చేయవద్దు అని ఆమె విజ్ఞప్తి చేసారు. కాగా బెంగాల్ కి చెందిన వలస కూలీలు ఎక్కువగా తెలంగాణాలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: