IHG

లాక్ డౌన్ కారణంగా రోజువారీ కూలీలు తమ జీవితాన్ని దయనీయంగా గడుపుతున్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమ లాక్ డౌన్ లో ఉండిపోవడంతో అట్టడుగు స్థాయి వారు చాల ఇబ్బంది పడుతున్నారు. వీరి కోసం పలువురు ఇండస్ట్రీ పెద్దలు తమ దాతృత్వాన్ని చాటుతూ వారికీ ఎలాగోలా సాయం చేస్తున్నారు. కానీ వీరికి ఆ సాయం ఏమాత్రం సరిపోక కూలినాళ్ళు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. మరికొందరు తప్పుడు మార్గాలను ఎంచుకొని ఈజీ మనీ కోసం వెంపర్లాడుతున్నారు.

IHG

అయితే తాజాగా కేరళ రాష్ట్రానికి చెందిన సీరియల్ యాక్ట్రెస్ ఈ వ్యవహారం లో ముఖ్య నిందితురాలిగా అరెస్ట్ అయ్యింది. కేరళ త్రివేడ్రంలోని నెయ్యిటింకర ప్రాంతంలో సారా తయారుచేస్తున్నట్టుగా పోలీసులకు సమచారం అందటంతో దాడులు జరపగా.. అధిక మొత్తం సారాను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ సారా వ్యాపారం అంతా షినీ అనే సీరియల్ నటి నడిపిస్తుండటంతో పోలీసుల ఖంగుతిన్నారు. సదరు నటి ఓ మర్డర్ కేసులో ముఖ్య నిందితుడి తో కలసి ఈ వ్యాపారానికి తెరలేపింది. పోలీస్ లు ఆమెను అదుపులో తీసుకోని విచారణ కొనసాగిస్తున్నారు. గత కొంతకాలంగా భారీగా సారా వ్యాపారం నడిపిస్తున్నట్టు పోలీసులు తమ విచారణలో కనుగొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: