టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ ఫౌండేషన్ ద్వారా లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేదలకు తన వంతుగా సహాయం చేస్తున్నారు. వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందిస్తున్నారు. ఇందుకోసం ఒక ఫండ్ ని ఏర్పాటు చేసిన విజయ్... భారీ ఎత్తున విరాళాలను సేకరించే కార్యక్రమం చేస్తున్నారు.
ఇక ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ తన ఫౌండేషన్ సహకారంతో 15873 కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందించారు. దీనిపై యువ దర్శకుడు నాగ్ అశ్విన్ ట్విట్టర్ లో ధన్యవాదాలు చెప్పారు. దీనిపై పలువురు సినీ ప్రముఖులు కూడా అతనికి అభినందనలు తెలుపుతున్నారు. అతను ఇలాగే సహాయం చెయ్యాలి అని అతనికి అందరి నుంచి సహాయ సహకారాలు అందాలి అంటూ కామెంట్ లు చేస్తున్నారు సోషల్ మీడియా లో.
15873 families funded...not a joke! Thank you vijay for helping, inspiring and walking your talk... https://t.co/Q29v1twEYO
— Nag Ashwin (@nagashwin7) May 17, 2020