జీవనం జీవనోపాధిపై తాము దృష్టి పెట్టామని కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. ప్యాకేజికి సంబంధించిన చివరి విడత వివరాలను ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా తాము 7 రంగాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టామని నిర్మలా సీతారామన్ అన్నారు. లాక్ డౌన్ తర్వాతి కార్యక్రమాలకు సిద్దమవుతున్నామని చెప్పారు. 

 

ఉపాధి హామీ హెల్త్ వ్యాపారాలు, డీ క్రిమినలైజేషన్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజెస్ పాలసీ రాష్ట్ర ప్రభుత్వాలు వనరుల మీద దృష్టి పెట్టామని ఆమె చెప్పారు. పేదలకు ఆహారం అందించడం ప్రభుత్వం బాధ్యత అని ఆమె పేర్కొన్నారు. ఈ సంక్షోభ సమయాన్ని తాము అవకాశంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నామని ఆమె అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: