విద్యా ప్రసారాల కోసం నాలుగు గంటల ఎయిర్ టైం కేటాయించామని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. స్కూల్స్ డిజిటలైజేషన్ కి అనుమతి ఇచ్చామని స్వయం ప్రభ ఛానల్ ద్వారా ఇప్పటికే ఆన్లైన్ పాఠాలు చెప్తున్నామని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు గ్రామీణ ప్రాంత విద్యార్ధుల కోసం మరో 12 చానల్స్ ని ప్రారంభిస్తున్నామని అన్నారు. 

 

విద్యార్ధుల విద్యకు తాము ప్రాధాన్యత ఇస్తున్నామని నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. సొంత ఊర్లకు వెళ్తున్న వలస కార్మికుల కు తాము అండగా ఉంటామని చెప్పారు. వారి ఆరోగ్యానికి కూడా తాము ప్రాధాన్యత ఇస్తామని నిర్మల చెప్పారు. రైతులకు తాము భారీగా నిధులు ఇచ్చామని చెప్పారు. జన ధన్ ఖాతాల ద్వారా మహిళలకు రెండు వేల కోట్లు ఇచ్చామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: