ఆంధ్రప్రదేశ్ లో వలస కార్మికులు ఎవరూ కూడా ఇబ్బందులు పడవద్దని ఏపీ సిఎం వైఎస్ జగన్ అన్నారు. ఏపీ నుంచి వెళ్తున్న వలస కార్మికులపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. వారి గురించి వివరాలను, వారికి అందించే సహాయక కార్యక్రమాలను సిఎం ఓ అధికారులను అడిగి ఆయన తెలుసుకున్నారు. 

 

వారికి అండగా ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలను అధికారులు ముఖ్యమంత్రి జగన్ కి వివరించారు. ఓడిస్సా కు వెళ్తున్న 902 మంది వలస కూలీలను బస్సులు ఇచ్చి పంపించామని జగన్ కి అధికారులు వివరించారు. వారికి షెల్టర్లు ఇచ్చి బస్సుల్లో పంపించామని ఆయన చెప్పారు. వారి కి ఆవాసం కల్పించే విషయంలో సదుపాయాలను కల్పించే విషయంలో ఖర్చు గురించి ఆలోచించ వద్దని ఆయన సూచించారు. భోజనం విషయంలో లోటు రావొద్దని జగన్ ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: