లాక్ డౌన్ కారణంగా ఎన్నో పెళ్ళిళ్ళు వాయిదా పడ్డాయి. డబ్బు ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అనే తేడా లేకుండా పెళ్ళిళ్ళను వాయిదా వేసారు. ఇక లాక్ డౌన్ లో వాయిదా పడుతుంది అనుకున్న యంగ్ హీరో నిఖిల్ వివాహం జరిగింది. ఈ పెళ్లిని ఎవరూ లేకుండా ఏ హడావుడి లేకుండా చాలా సైలెంట్ గా చేసుకున్నారు. 

 

ఇక ఈ పెళ్లి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పెళ్లి వీడియోకు ఏమాయ చేసావే లోని మనసా మళ్లీ మళ్లీ చూసా అనే పాటను బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌లో పెట్టుకుని వీడియో పోస్ట్ చేసారు. దీనికి సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తుంది. ఈ వీడియో ని చూసి పలువురు హ్యాపీ మ్యారీడ్ లైఫ్... లైఫ్ లో లాక్ డౌన్ అయ్యావ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: