మహారాష్ట్రలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో ఉంది. అక్కడ కరోనా కేసులు అత్యంత వేగంగా నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడి కోసం చర్యలు చేపట్టినా సరే పెద్దగా ఫలితం మాత్రం ఉండటం లేదు. రాష్ట్ర రాజధాని ముంబై లో అయితే ఏకంగా 25 వేల కేసులు ఉన్నాయి అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. 

 

కరోనా కట్టడి లో భాగంగా ఇప్పుడు కీలకంగా మారిన లాక్ డౌన్ ని ఈ నెల 31 వరకు పెంచుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన లో తెలిపింది. లాక్ డౌన్ ని కఠినం గా అమలు చేస్తామని అందులో సందేహం లేదని పేర్కొంది. అయితే సడలింపు ల గురించి ప్రభుత్వం ఏమీ చెప్పలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: