పూరి జగన్నాథ్ ఛార్మి మధ్య ఉన్న స్నేహం గురించి అందరికి తెలిసిందే. వీరి ఇద్దరి మధ్య స్నేహం గురించి ఏదోక వార్త మీడియా లో వస్తూనే ఉంటుంది. సోషల్ మీడియా లో ఈ ఇద్దరు చాలా యాక్టివ్ గా ఉంటారు. వాళ్ళ ఇద్దరి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రతీ ఒక్కటి సోషల్ మీడియా వేదికగా తమ అభిమానులతో పంచుకునే ప్రయత్నం చేస్తారు. 

 

నేడు ఛార్మి పుట్టిన రోజు. ఈ నేపధ్యంలో పూరి ఛార్మి కి శుభాకాంక్షలు చెప్పాడు. ‘‘నా ఇస్మార్ట్ ఫైటర్ ఛార్మికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు. నీ జీవిత అంత సులువుగా సాగ‌లేదు. అయితే నువ్వెంత బ‌ల‌వంతురాలివో నాకు తెలుసు. మ‌నం క‌లిసి ఇంకా ప్ర‌యాణించాలి. నువ్వు న‌న్ను గ‌ర్వ‌ప‌డేలా చేశావు. పూరీ క‌నెక్ట్స్‌కు నువ్వే అస‌లైన బ‌లం. నీకు మరిన్ని విజ‌యాలతో పాటు ఆరోగ్యంగా నువ్వు ఉండాల‌ని కోరుకుంటున్నాను’’ అని పూరి పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: