ఒక పక్క అమెరికాలో కరోనా వైరస్ తీవ్రత ఉన్నా సరే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైఖరి లో మాత్రం ఏ మార్పు రావడం లేదు. ఆయన ప్రపంచ దేశాల నుంచి మందులు లాక్కునే కార్యక్రమాలను చేస్తున్నారు. భారత్ నుంచి ఇప్పుడు కరోనా కట్టడిలో భాగంగా కొన్ని ఔషధాలను తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అని తెలుస్తుంది. 

 

ప్రధాని నరేంద్ర మోడికి ట్రంప్ నుంచి ఫోన్ వచ్చింది అని ఆయన మందులు కావాలని ఒత్తిడి చేసే విధంగా మాట్లాడారు అని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు మన దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో మోడీ నుంచి ట్రంప్ కి స్పష్టమైన హామీ ఏదీ రాలేదు అని అంటున్నారు. దీనిపై ఇప్పుడు పెద్ద చర్చలు జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: