అది తమిళనాడు తిరుపత్తూర్ జిల్లా జోల్లరి పెట్టాయి. కరోనా కేసులు ఎక్కువగానే ఉన్నాయి అక్కడ. లాక్ డౌన్ తో జనాలు బాగా ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఆ ప్రాంతంలో ఉండే దాదాపు 80 వేల మందికి ఇప్పుడు నిత్యావసర సరుకులను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

 

ప్రజలకు కూడా సమాచారం అందింది. మీరు వచ్చి సరుకులు తీసుకోవాలని సూచనలు చేసింది. కాని మాస్క్ లు లేకుండా సామాజిక దూరం లేకుండా ప్రజలు అందరూ కూడా ఒకరి మీద ఒకరు పడ్డారు. దీనిపై ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతుంది. కొంత మంది ప్రజలను ఆదుకోవడం కూడా ఒకరకంగా పాపమే అంటూ కామెంట్ చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పుడు దీనిపై ఆందోళన వ్యక్తమవుతుంది. వాళ్ళు మారే మనుషులు కాదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: