లాక్ డౌన్ 4 కి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం కాసేపటి క్రితం విడుదల చేసింది. రాష్ట్రాల మధ్య రవాణా కు షరతులతో కూడా అనుమతులను ఇచ్చింది కేంద్రం. అంతరాష్ట్ర బస్సు సర్వీసులను షరతులతో నడుపుకోవచ్చు అని కేంద్రం తన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. అది రాష్ట్రాల మధ్య పరస్పర అంగీకారం తో అని స్పష్టం చేసింది. 

 

రెస్టారెంట్స్ గాని హోటల్స్ గాని ఎలాంటి పరిస్థితిలో తెరవడానికి వీలు లేదని పేర్కొంది. రాష్ట్రాల ఆమోదం తోనే అంతరాష్ట్ర బస్ సర్వీసులు నడుస్తాయి అని కేంద్రం మార్గదర్శకాల్లో స్పష్టంగా సూచనలు చేసింది. ప్రజారవాణా విషయంలో కూడా రాష్ట్రాలకే అధికారం ఉంటుంది అని కేంద్రం పేర్కొంది. కంటైన్మేంట్ జోన్ విషయంలో పరిస్థితి ఆధారంగా రాష్ట్రాలు నిర్ణయం తీసుకొచ్చు అని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: