IHG

సమంత అక్కినేని వారి కోడలు అయిన నాటినుండి కాస్త పద్ధతిగా సినిమాలను చేస్తూ ఆ ఇంటి గౌరవాన్ని నిలబెడుతోంది. సమంత పెళ్లి తరువాత ఓహ్ బేబై , యూ-టర్న్ , సూపర్ డీలక్స్ వంటి సినిమాలు హిట్ సాధించడంతో. ఎక్కువ హీరోయిన్ ఓరియంటెడ్ పాత్రలకే ప్రాధాన్యం ఇస్తోంది సమంత. మరోవైపు సినిమాల‌తోనే కాకుండా డిజిట‌ల్ రంగంలోనూ ఆమె అడుగు పెట్టారు. `ద ఫ్యామిలీ మెన్` వెబ్ సిరీస్ సీజ‌న్‌2లో ఓ నెగటీవ్ పాత్రలో న‌టిస్తున్నాన‌ని రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలోనూ చెప్పారామె.అయితే ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ పలు సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మించారు.

 

మైత్రి మూవీ మేకర్స్ వారు సమంత ను  అప్రోచ్ అయ్యి ఓ కథను గురించి చెప్పారు అయితే తాను ఈ సినిమాను చేస్తున్నట్లు అంగీకారం తెలిపింది. దింతో మైత్రి మూవీస్ వారు కథను సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ , హరీష్ శంకర్ సినిమా కి సంబందించిన స్క్రిప్ట్ ని మైత్రి వారు రెడీ చేస్తున్నారు ఇదే క్రమం లో సమంత సినిమాకి సంబందించిన స్క్రిప్టును కూడా వారు తయారు చేస్తున్నారు. అయితే ఈ సినిమా కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమా  అవుతుండడం తో  అభిమానులు మరో ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రం వస్తుందని తెగ సంబరపడుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: