దేశంలో కరోనా మహమ్మారి వల్ల ఎంతో మంది సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ మద్య వలస కార్మికుల విషయంలో కొన్ని సడలింపులు చేశారు.  వివిధ రాష్ట్రాల్లో ఉన్నవారు తమ గమ్య స్థానాలకు వెళ్లవొచ్చని చెప్పారు.  దాంతో వలస కార్మికులు తమ గమ్యస్థానం చేరుకుంటున్న విషయం తెలిసిందే. కానీ వారి సమస్యలు మాత్రం తీరడం లేదు.. దాంతో కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వలస కార్మికులను నిర్లక్ష్యం చేస్తే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.  వలస కార్మికుల సమస్యలు పట్టించుకోకపోతే ప్రాణ త్యాగానికి సిద్ధమని ప్రకటించారు.

 

గాంధీభవన్‌లో వీహెచ్‌ దీక్ష విరమించారు. వీహెచ్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్షను ఆ పార్టీ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విరమింపజేశారు. వీహెచ్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్షను ఆ పార్టీ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విరమింపజేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ వలస కార్మికులను ఆదుకోవడంలో కేసీఆర్‌ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు పంపించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత చొరవ తీసుకుంటే అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ ప్రభుత్వంపై నమ్మకం లేక వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు వెళ్తున్నారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: